[gtranslate]
హాయ్ అండీ,
మనం బ్లౌజ్. డ్రెస్ , ఇలా ఏది కట్ చేసి కుట్టాలన్నా ముందు మనకి Measurements తీసుకోవటం అనేది అవసరం. అంతేగా మరి Measurements లేకుండా ఏం చేస్తాం. ఒక చిన్న తప్పిదం జరిగినా అది మన బ్లౌజ్ కి కానీ మన డ్రెస్ కి కానీ పొడవు తగ్గటం , లేదా వెడల్పు అవ్వటం జరగవచ్చు.
ఒక్క చిన్న ఇంచ్ చాలు పొరపాటు జరగటానికి. అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. కనుక First ఈరోజు అసలు Tape లో ఎటు సైడ్ దేనికి కొలుస్తారు అనేది ముందు తెలుసుకుందాం. INCHES దేనికి వాడతారు , CMS దేనికి వాడతారు అనేది చూద్దాం.

Tape in Inches (టేప్ కి ఒక సైడ్ Inches లో)




1/4 Inch = Pavu Inch ( పావు ఇంచ్ )
1/2 Inch = ara Inch ( అర ఇంచ్ )
3/4 Inch = Muppavu Inch ( ముప్పావు ఇంచ్ )
1 Inch = inch ( ఇంచ్ )
ఒక Tailoring Tape కి 60 Inches ఉంటాయి.
Tape in Cms ( టేప్ కి మరో వైపు Cms లో )

25Cms = 1/4 Meter ( పావు మీటర్ )
50Cms = 1/2 Meter ( అర మీటర్ )
75Cms = 3/4 Meter ( ముప్పావు మీటర్ )
100Cms= 1 Meter ( 1 మీటర్ )
ఒక Tailoring Tape కి 152 Cms ఉంటాయి , అంటే ఒకటిన్నర మీటర్ (1.5 Meters ) ఉంటుంది మన దగ్గర ఉండే Tailoring Tape
DIFFERENCE BETWEEN INCHES / CENTIMETERS ( Inches కి Cms కి తేడా )
| INCHES | CMS |
| BLOUSE , DRESS , FROCK ఇలా ఏదైనా CUTTING MARK చేసుకోవటానికి Inches లో కొలుస్తాము | మనం ఒక Blouse కి కానీ Dress కి కానీ Cloth తీసుకోవటానికి Cms లో కొలుస్తాము |
| ఉదాహరణకి: ఇప్పుడు మన బాడీ లో కొలతలు తీసుకోవాలి అంటే మనం Inches లో Measurements తీసుకుంటాం. | ఉదాహరణకి: ఇప్పుడు మనకి బ్లౌజ్ కుట్టించుకోవాలి అంటే మనము ఏం చేస్తాం ఒక బ్లౌజ్ పీస్ తీసుకుంటాం . ఒక బ్లౌజ్ పీస్ 80cms ఉంటుంది. |
Main గా Tape ని మనం inches లోనే ఎక్కువ Use చేస్తాము.
ఇప్పుడు టేప్ ని ఎలా వాడాలి , ఎటువైపు ఎలా ఉపయోగించాలి అనేది తెలిసింది కదా.
పైన చూసాం కదా.
Home Work :-
అందరి దగ్గర Machines ఉన్నాయ్ కదా ఒకసారి మెషిన్ తీసి మొత్తం ఆయిలింగ్ చెయ్యండి.
ఒకసారి మెషిన్ గురించి తెలుసుకోవటం కోసం ఈ వీడియో చూడండి ఏమైనా డౌట్స్ ఉంటె
Tailoring Machine Oiling, Repairs, Basic Information :- https://youtu.be/gBd2qcn7P_Q
ఒక చిన్న Task ఇస్తాను ఈరోజు ఈ Task ని complete చెయ్యండి.
ఒక White Paper ని తీసుకొని పేపర్ పైన Straightగా Line డ్రా చెయ్యండి. 7 Inches ఒక line , 12 inches , 4 inches , ఇలా మీకు నచ్చిన అన్ని lines draw చేసుకొని మెషిన్ సూది కి దారం ఎక్కించకుండా కరెక్ట్ గా draw చేసిన దాని పైన మెషిన్ తో stitches వెయ్యండి. కొంచం ఈజీ గానే ఉంది అనిపిస్తే మెషిన్ కి thread ఎక్కించి cloth పైన కుట్లు వెయ్యండి. ఇలా Straight గా , Curve , Square , L Shape లో కుట్లు వేసి work చూపించండి.
కుట్లు వెయ్యమని చెప్పాను కదా అని Speed గా చేస్తే ఐపోతుంది అని కాకుండా నిదానంగా ప్రాక్టీస్ చెయ్యండి.
Task సింపుల్ గా ఉంటుంది కానీ ఇది చాలా Important అండీ. నేను ఈ టాస్క్ ఎందుకు ఇచ్చానో మీకు Next Classes లో తెలుస్తుంది.
Reference Pics



